సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి

సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి

 జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి :వచ్చే సార్వత్రిక ఎన్నికలను స్వేచ్చగా, పారదర్శంగా నిర్వహించేందుకు పొలిటికల్ పార్టీ ప్రతినిధుల సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్  పవార్ కోరారు.  శుక్రవారం మధ్యాహ్నం సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వనపర్తి జిల్లా లోని పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో జిల్లాస్థాయి  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఎస్.ఎస్.ఆర్. 2023 షెడ్యూల్ ప్రాకారంగ ఎలక్టరోల్ సిద్ధం చేయడం జరిగిందని జూలై, 2023 ప్రామాణిక తేదీతో వచ్చే ఓటరు నమోదు  దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన వారికి  ఓటరు ఎపిక్ కార్డుకు పంపడం జరుగుతుందన్నారు.  ఓటరు జాబితా తప్పులు లేకుండా ఎలాంటి అపోహలు లేకుండా ఉండేందుకు జిల్లాస్థాయి, ఈ.ఆర్. ఒ స్థాయిలో పొలిటికల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  

తొలగించిన ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల మార్పు చేర్పులు, ఇతరత్రా సలహాలు, సూచనలు ఇవ్వాలని తద్వారా తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించుకోవచ్చు  అన్నారు. జనవరి 5 2022 నుండి జనవరి 5 2023 వరకు 11190 మందిని ఓటర్లు జాబితా నుండి తొలగించడం జరిగిందన్నారు. ఇందులో మరణించిన వారు మరో ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఓకే ఫోటో తో డబుల్ ఓటర్లుగా  నమోదు అయినవారు ఉన్నారు.  వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో  విచారణ చేసిన అనంతరమే పారదర్శకంగా తొలగించడం జరిగింది.  ఓకే ఇంటి నేంబరుతో 6 అంతకన్నా ఎక్కువ ఓటర్లు నమోదు  అయిన వారి ఇళ్లను క్షేత్రస్థాయిలో విచారణ జరిపించడం జరుగుతుందని, విచారణ అనంతరం తగిన చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలాంటి కీలక విషయాల్లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు ఏమైనా ఆక్షేపణలు ఉంటే సమాచారం ఇవ్వాలని.సూచించారు.  జూన్ 1 నుండి 20 రోజుల పాటు ఈ.వి.యం, వి.వి ప్యాట్, కంట్రోల్ యూనిట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పార్టీ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని అందుకు పార్టీ ప్రతినిధులు తప్పకుండా హాజరు అయ్యేవిధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. వేణుగోపాల్,  టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సిపిఎం పార్టీ కార్యదర్శి జబ్బార్, బిజెపి పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్, రామ్మోహన్,  టిడిపి  నుండి జమిల్, బి.ఎస్.పి నుండి చిరంజీవి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.