కల్వరాల లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ - అభినందించిన మాజీమంత్రి జూపల్లి

కల్వరాల లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ - అభినందించిన మాజీమంత్రి జూపల్లి

ముద్ర.వీపనగండ్ల:-ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీపనగండ్ల మండలంలోని కల్వరాల లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడంతో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అభినందించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేయటంతో కాంగ్రెస్ పార్టీకి 729 ఓట్ల భారీ మెజారిటీ రావడంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు  ఆనందం వ్యక్తం చేసి వారిని అభినందించారు. తన గెలుపు కోసం పడిన కష్టాన్ని వృధా కానివ్వను అని కల్వరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు,ఓట్లు వేసిన ప్రజలకు ఏళ్ల వేళల అండగా ఉంటానని తెలిపినట్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపల్లి ముఖ్య అనుచరుడు వాట్సాప్ నరసింహ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాబోతున్న జూపల్లి కృష్ణారావు కు అభినందలు తెలిపారు.ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో ఏ నాయకుడికి రాని మెజారిటీ కల్వరాల గ్రామంలో జూపల్లి కృష్ణారావు కు వచ్చిందని నరసింహ వివరించారు.