దిగ్విజయంగా కొనసాగుతున్న రిజర్వ్ బ్యాంకు ప్రజా భాగస్వామ్య విధానం

దిగ్విజయంగా కొనసాగుతున్న రిజర్వ్ బ్యాంకు ప్రజా భాగస్వామ్య విధానం

హైదరాబాద్ ముద్ర న్యూస్: జి20 కి భారతదేశ అధ్యక్షత - భారతీయ రిజర్వు బ్యాంకు, హైదరాబాద్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు భారతదేశం జి20 అధ్యక్షతను డిసెంబర్ 01, 2022 నుండి స్వీకరించింది మరియు ఇది నవంబర్ 30, 2023 వరకు కొనసాగుతుంది. భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో భారతీయ రిజర్వు బ్యాంకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జి20 భావనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ రిజర్వు బ్యాంకు చేసే చొరవలో భాగంగా,  శిల్పారామం, మాదాపూర్‌, హైదరాబాద్‌లో చిన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం ఆర్ బిఐ "3-రోజుల వాణిజ్య ప్రదర్శన"ని ఏర్పాటు చేసింది.

దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలు తమ అంగళ్ళను ఏర్పాటు చేసి ఖాదీ, కోల్డ్ ప్రెస్డ్-ఆయిల్స్, మొక్కల ఆధారిత పోషకాలు మొదలైన స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తులను క్రయవిక్రయాలు చేశారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు, జి20 ప్రాతిపదిక/థీమ్ - “వసుదైవ కుటుంబం” - ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే దానితో దీర్ఘ కాల ప్రయోజనాలకు దోహదపడతాయని శ్రీమతి కె. నిఖిల, ప్రాంతీయ సంచాలకులు, తెలంగాణ, భారతీయ రిజర్వు బ్యాంకు పేర్కొన్నారు. ఇది చిన్న వ్యాపారవేత్తలను మరింత అభివృద్ధి సాధనకి ప్రోత్సహించడం ద్వారా వ్యవస్థాపకతను పెంచే క్రమంలో కూడా సహాయకారిగా ఉంటుంది.