సామాన్యులకు అందని రాజ్యాంగ ఫలాలు

సామాన్యులకు అందని రాజ్యాంగ ఫలాలు

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  వేముల వీరేశం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. అంబేద్కర్‌ ఆశయాలకు భిన్నంగా బిజెపి పార్టీ విధానాలను అనుసరిస్తుంది అన్నారు. రాజ్యాంగ ఫలాలు సామాన్య ప్రజలకు అందడం లేదు  అని తెలిపారు. మేధావులు బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని అన్నారు. కేసీఆర్‌ దేశంలో అన్ని రంగాలలో సమూల మార్పులు తీసుకురావడం కోసం పోరాడుతున్నాడని ఆయనకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని అయన కోరారు.