గ్రామాల్లో ఆర్థిక కష్టాలు

గ్రామాల్లో ఆర్థిక కష్టాలు

గ్రామాల్లో ఆర్థిక కష్టాలు
గ్రామాల్లో ఆర్థిక కష్టాలు నెలకొన్నాయి. కనీసం బ్లీచింగ్‌? కొనుగోళ్లకు కూడా రూపాయి లేదు. మూడు నెలల నుంచి పంచాయతీ ఖజానాకు తాళం వేసిన ప్రభుత్వం ఇప్పటికీ అవే ఆంక్షలు కొనసాగిస్తోంది. ఫలితంగా పారిశుద్ధ్యానికి కూడా కష్టాలు నెలకొన్నాయి. మరోవైపు పంచాయతీ సిబ్బంది వేతనాలు ఇంకా ఆలస్యమవుతూనే ఉన్నాయికరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి వీధుల్లో రోజువారీగా క్లీనింగ్‌? చేసి, బ్లీచింగ్‌?, రసాయనాలను పిచికారీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

కొవిడ్‌? వ్యాప్తి ఉన్న నివాస గృహాల చుట్టూ రోజుకు మూడుసార్లు బ్లీచింగ్‌? చేయాలంటూ సూచించారు. కానీ గ్రామాల్లో బ్లీచింగ్‌? కొనుగోలు చేసేందుకు చిల్లిగవ్వ లేదు. అటు డీపీఓల నుంచి కూడా బ్లీచింగ్‌? సరఫరా చేయడం లేదు. దీంతో బ్లీచింగ్‌?ను కొన్నిచోట్ల సర్పంచ్‌?లు సొంతంగా కొనుగోలు చేసి చల్లుతున్నారు. గత మూడు నెలల నుంచి సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నామని, కానీ రూపాయి బిల్లు కూడా ఇవ్వడం లేదని సర్పంచ్‌?లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించి అక్టోబర్‌?? నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 1100 కోట్లు పెండిరగ్‌?లో ఉండగా? ఈ చెక్కులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. పల్లె ప్రగతి నిధులు కూడా ఆపేశారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేసినట్లు జీవో ఇచ్చినా.. వాటిని డ్రా చేసుకునేందుకు మాత్రం అవకాశం లేదు. పంచాయతీ ట్రెజరీల్లో పల్లె ప్రగతి నిధి బ్యాలెన్స్‌? చూపిస్తున్నారు. కానీ చెక్‌?లు మాత్రం క్యాష్‌? కావడం లేదు.

మిషన్‌? భగీరథతో పాటుగా ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, హరితహారం వంటి పనుల బిల్లులు కూడా ఆపేశారు. ప్రస్తుతం ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లింపులు ఈ నెలలో చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు మినహా? ఒక్క రూపాయి విడుదల చేయరాదంటూ స్పష్టంగా సూచిస్తోంది. ఇప్పుడు పంచాయతీల్లో తీసుకున్న ట్రాక్టర్లకు ఈఎంఐ చెల్లింపులు కష్టంగా మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ చెక్కులు రిటర్న్‌? కావడంతో సర్పంచ్‌?లు, పంచాయతీ కార్యదర్శుల ఖాతాలపై ప్రభావం పడుతోంది. ఈసారి కూడా చెక్కులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం బిల్లులు విడుదల చేసే ఛాన్స్‌? లేదని అధికారులు చెప్పుతున్నారు.పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయి. ప్రతినెలా సర్పంచ్‌?లకు వేతనాలు ఇస్తామని ప్రభుత్వం గతేడాది జీవో జారీ చేసింది. కానీ నెలనెలా వేతనాలు రావడం ఇబ్బందిగానే మారింది. ఈ నెలలో ఇంకా పంచాయతీ కార్మికులకు జీతాలు కూడా జమ కాలేదు.