ఓటరు నమోదు కేంద్రాల ఆకస్మిక తనిఖీ

ఓటరు నమోదు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
  • 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

ముషీరాబాద్, ముద్ర:ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కేంద్రాలను జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్  ఆకస్మికంగా తనిఖీ చేసారు. చిక్కడపల్లి బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కాలాశాల ప్రాంగణంలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ 201, 202, 203, 204, 205, 215, 216 లని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఓటర్ నమోదు కొసం వచ్చిన బాలికను పలకరించిన కమిషనర్ దగ్గరుండి ఆన్లైన్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటరు నమోదు ఎలా చేసుకోవాలో వివరించారు. వారితోనే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయించారు. అనంతరం రోనాల్డ్ రోస్  మాట్లాడుతూ 1అక్టోబరు వరకు 18 సంవత్సరాలు నిండినటువంటి బాలబాలికలు తప్పనిసరిగా ఓటరుగా తమ పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ఓటరు పేరు, ఇంటి అడ్రస్ లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే కూడా సవరణ చేసుకొనవచ్చునని తెలిపారు. ఓటరు నమోదు కొరకు ప్రజల సౌకర్యార్థము తేదీ 26, 27 ఆగస్టు 2023  2 , 3 సెప్టెంబర్ 2023 ప్రత్యేక దినాలలో నమోదు చేసుకోవచ్చునని సీఈవో ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక దినాలలో ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరు నమోదు కొరకు బిఎల్వోలు అందుబాటులోఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డిప్యూటీ కమిషనర్, ఓటరు నమోదు అధికారి డాక్టర్ తిప్పర్తి యాదయ్యతో పాటు సహాయ ఓటర్ నమోదు అధికారి ప్రవీణ్ చంద్ర  పాల్గొన్నారు.