వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి - అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి - అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముద్ర, తెలంగాణ,బ్యూరో:-నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలి...అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

భారీ వర్షాల  నేపథ్యంలో GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, ట్రాన్స్ కో MD, EVDM డైరెక్టర్, కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి.

ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలి.

హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.

నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలి.

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి.

ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి.

అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలి.