కాలేశ్వరం అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం

కాలేశ్వరం అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం

ప్రమాణస్వీకారోత్సవ సభలో పుట్ట మధు

మహాదేవపూర్, ముద్ర: 45 ఏండ్ల గత కాంగ్రెస్ కుటుంబ పాలన హయాంలో కాలేశ్వరం నయా పైసా అభివృద్ధి చెందలేదని, స్వర్గీయ చొక్కారావు తరువాత టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ హయాంలోనే కాలేశ్వరం పుణ్యక్షేత్రం అభివృద్ధి సాధిస్తున్నదని, ఇప్పటికే 25 కోట్ల పనులు పూర్తయ్యాయి మరో వంద కోట్లు సీఎం ఇస్తారని, అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ తోటే సాధ్యమని పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ నొక్కి చెప్పారు. కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గా లింగంపల్లి శ్రీనివాసరావు మరియు ధర్మకర్తలు ప్రధాన ఆలయంలో ఈవో మహేష్ ఆధ్వర్యంలో పదవీ ప్రమాణం చేసిన అనంతరం ఏర్పాటుచేసిన పాలక మండలి సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజలను ప్రేమించలేని వారు, కార్యకర్తలను పట్టించుకోని వారు ఈ ప్రాంతాన్ని పాలిస్తుంటే ప్రజలు ఇలా సహిస్తున్నారో అర్థం కావడం లేదని, తమ కుర్చీ కోసమే ఆరాటపడే కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

తాను ప్రజల కోసం నిష్కల్మషంగా పనిచేసి నాలుగు సంవత్సరాలలో 45 సంవత్సరాల అభివృద్ధికి తేడా చూపించామని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నాన్ని కాలరాసి ఒకేరోజు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించిన గొప్ప కార్యకర్త లింగంపల్లి శ్రీనివాసరావును కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గా నియమించడం పార్టీ కోసం పాటుపడే కార్యకర్తలకు దొరికే గౌరవాన్ని సూచిస్తుంది అన్నారు. పాలకమండలి స్వార్థ ప్రయోజనాలు చూసుకోకుండా దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టి ముఖ్యమంత్రి కాలేశ్వరం దేవస్థానం పేరును దశదిశల వ్యాపింప చేశారని, కాలేశ్వరం దేవస్థానం కమిటీ ఉన్నతమైన కార్యకర్తలతో ఏర్పడిందని వారిని అభినందించారు.

భూపాలపల్లి జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని మాట్లాడుతూ ఈరోజు భూపాలపల్లి జిల్లా అంటే గుర్తుపట్టలేని వారు కాలేశ్వరం అంటే గుర్తుపట్టే రీతిలో ఇక్కడ ప్రాజెక్టులు, దేవాలయం సమాంతరంగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎంపీపీ రాణిబాయి, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమత మనోహర్, కాలేశ్వరం సర్పంచ్ వసంత మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రేవెల్లి మమత, మహాదేవపూర్ ప్యాక్స్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, మంథని ఎంపీపీ శంకర్, మంథని మార్కెట్ కమిటీ అధ్యక్షులు అనంతరెడ్డి, కాటారం సింగిల్ వుండే చైర్మన్ చల్ల నారాయణరెడ్డి మంథని జడ్పిటిసి సుమలత పాల్గొనగా సభకు లింగంపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అనంతరం వేదికపై ఉన్న చైర్మన్ లింగపల్లి శ్రీనివాసరావుతో పాటు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన కలికోట దేవేందర్ అడప సమ్మయ్య, కుంభం పద్మ, సిద్ధాంతి భాను ప్రకాష్, మెండు వెంకటస్వామి, బండి రాజయ్య, ఆరెల్లి సత్యనారాయణ, అనంతుల రమేష్ బాబు, కామిడి రామ్ రెడ్డి, దేవడా శ్యాంసుందర్, డి. ప్రశాంత్ రెడ్డి, శిల్ప రాజయ్య, కోరిపల్లి దేవేందర్ రెడ్డి లను పలువురు ఘనంగా సన్మానించారు.