ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల
schedule for MLA Kota MLC election

ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్‌ వెలువడనున్నది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగనున్నది. ఎన్నికలకు మార్చి 23న పోలింగ్‌ జరుగనున్నది. అదే రోజు కౌంటింగ్‌ జరుగనున్నది. ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

నవీన్‌రావు, గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2017లో ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.