బదిలి అయి వారం అయిన మారని డిజిటల్ కీ లు ప్రజల ఇబ్బందులఫై కౌన్సిలర్ ఆగ్రహం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దారు లు బదిలీ అయి వారం రోజులు గడుస్తున్న కొత్తవారికి డిజిటల్ కీ రాక పలు సర్టిఫికెట్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 35వ వార్డు కోసిలర్ హనుమండ్ల జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశ్రీ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ కు కొత్త కమీషనర్ ఆగస్టు 1న జాయిన్ అయిన వారం రోజులు అవుతున్న ఇప్పటి వరకు డిజిటల్ కీ, డిజిటల్ సైన్ కానీ ఇంకా తయారు చేయించకుండా తాత్పర్యం చేస్తూ పాత కమీషనర్ నరేష్ తో కొన్ని పాత పైళ్ళపైన, డబ్బు చెల్లింపులకు సంబంధించిన వాటి పైన, రికార్డులపైన సంతకాలు చేస్తూ ఉన్నతాదికారులను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. డిజీటల్ కీ, డిజిటల్ సైన్ తయారీకి కేవలం 2 రోజులు సరిపోతుందని గృహలక్ష్మి పథకానికి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం, కాని తాసిల్దార్ డిజిటల్ కీ తయారుచేయించక పోవడం వల్ల లబ్ధిదారులు తహసిల్ ఆఫీస్ వద్ద పడిగాపులు పడు తున్నారని వెంటనే డీజిటల్ సైన్, డిజిటల్ కీలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.