హర్యానాలో విజృంభిస్తున్న మతోన్మాదం.....

హర్యానాలో విజృంభిస్తున్న మతోన్మాదం.....

ముద్ర ప్రతినిధి తెలంగాణ:-మతసామరస్యం. లౌకికతత్వం కాపాడుకోవాలని గత అనేక సంవత్సరాలుగా ప్రజాస్వామ్యవాదులు చెబుతున్న అక్షర సత్యాలు ఎంత నిజమో ఆచరణలో నేడు అర్థమవుతున్న సందర్భం ఇది. దేశ పాలకులు ఆ విధమైన సందేశంతో ముందుకు రావడం లేదు సరి కదా (ఎగదోసేందుకు) మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కారణం అవుతున్నారు. గత మూడు మాసాలుగా మణిపూర్ రాష్ట్రంలో హింసకాండ దేశవ్యాప్తంగా అనేకమందిని కలచివేస్తున్న ప్రస్తుత కర్ణంలో ఈశాన్య కుండకోణంలో మారుమూలల్లో మహిళలపై ఘోర కాళీ సాగిన తీరు తెలుసుకొని భారతమాత నల్లటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొనడం అత్యంత బాధాకరం. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని దేశ ప్రధాని సిగ్గుపడాలి. ప్రధాని మోడీ పార్లమెంటు భవనం ముందు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అత్యున్నత చట్టసభ అయినా పార్లమెంటులో అదే మాట చెప్పడానికి ఒప్పుకోకపోవడం దురదృష్టకరం. భద్రంగా చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాకపోవడం ఈ కుట్రల వెనుక ఎవరి పాత్ర ఉందో చెప్పకనే చెప్పినట్లుగా అర్థం అవుతుంది. అవిశ్వాస తీర్మాన రూపంలో చర్చ చేద్దామని ప్రతిపక్షాలు కొత్త వ్యూహం చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.

దేశ రాజధాని శివారులోని కార్పొరేట్ హబ్ గురుగ్రామ్. నూహ పట్టణాల్లో మతకలహాలు భగ్గుమనడం ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలను బిజెపి. ఆర్ఎస్ఎస్. విశ్వహిందూ పరిషత్. బజరంగ్ దళ్ లాంటి మత సంస్థలు బజారుకీదుస్తున్నాయి. మత సంస్థలు వ్యూహాత్మకంగా పెట్టిన చిచ్చు ఆరు ప్రాణాలు పోవడానికి కారణమయ్యింది. హిందుత్వ శక్తుల కవ్వింపు చర్యలు. వాటిపై అభద్రతతో ముస్లింలు రెచ్చిపోవడం తీవ్రహించకాండ కు దారి తీయడం దురదృష్టకరం. అక్కడ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు. పని చేసుకుని పొట్ట పోసుకునే శ్రమజీవులు. వలస ప్రాణులు అకారణంగా బలైపోవడం బాధాకరం. మణిపూర్ మంటలు ఢిల్లీ పాలకులను చేరడానికి చాలా సమయం పట్టింది కానీ హర్యానా విధ్వంసం దావనంలా వ్యాపించిన హింస దేశానికే కలవరం కలిగించాయి. ఈ సమయంలోనే వారణాసిలోని జ్ఞానవాసి మసీదు వాక్యం తిరగ దూడబడడం పలు అనుమానాలకు తావిస్తుంది. బాబ్రీ మసీద్. రామ జన్మభూమి వివాదం రగిలిన తీరులోనే ఇప్పుడు వారణాసి వివాదం పగులుకుంటుందని సందేహాలు దేశ ప్రజలలో బలంగా ఉన్నాయి. ఈ మసీదులో పురావస్తు పరిశోధన జరపాలంటూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి తిరిగి హైకోర్టుకు వచ్చి అనుమతి పొందాయి. ఈ అనుమతితో నిమిత్తం లేకుండానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాన్ని మసీదు అనక్కర్లేదని ఏకపక్షంగా ప్రకటించడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇలాంటి వైఖరి.

ఆచరణలో మతోన్మాద రాజకీయాలను ఎలా ప్రకోపింప చేస్తుందో చాలాసార్లు దేశ ప్రజలు చూసిన అనుభవం ఉంది. మధురాలోనూ కృష్ణా జన్మస్థానం ఇలాంటి మలుపులే తిరుగుతున్నది. వందల సంవత్సరాల కిందటి చరిత్ర పరిణామాలపై ఇలాంటి వివాదాలు పునరాగం కాకూడదని పార్లమెంటు 1991 ప్రార్ధన స్థలాల చట్టం ఆమోదించింది. అయోధ్య సమయంలో సుప్రీంకోర్టు తీర్పును పాటించాలని మిగిలిన అన్నిచోట్ల 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన నాటి యధాతధ స్థితి అనుమతించా రాదని ఈ చట్టం నిర్దేశించింది. కానీ స్వయానా సుప్రీంకోర్టు ఇప్పుడా చట్టానికి కొత్త భాష్యం చెప్పి కొత్త తగాదాలకు తలుపు తీయడం దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో చెప్పనవసరం లేదు. ఈ వివాదాలు. విధ్వంసాలు. విద్వేషాల పర్యవసానాల పట్ల ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నేడు మన ముందుంది. జైపూర్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్పిఎఫ్ జవాను నలుగురు ముస్లింలను వెతికి మరి కాల్చి చంపడం. అతని మతిస్థితం లేని వాడని అధికారులు సమర్పించడం కూడా మత కలహాల లో భాగమే. హరియానాలో చెలరేగిన మత ఘర్షణలు. విధ్వంస విద్వేషాలు వాస్తవానికి ఢిల్లీలో జరిగినట్టే భావించాలి. ఎందుకంటే గురుబ్రహ్మ పారిశ్రామిక కేంద్రం దేశ. దేశి పెట్టుబడులకు పెద్ద సమస్యలకు నిలయంగా ఉంది. దేశమంతటి నుండి వచ్చిన సాంకేతిక నిపుణుల నుండి. సామాన్యుల వరకు అక్కడ ఉంటారు. నీవల్లే పురుషుల కుంభవృష్టి వరదల సమయంలో ఈ సంపన్నులు తప్పించుకోగలిగారు కానీ మతకలహార దెబ్బకు వారు తట్టుకోలేక పోయారు. పనిచేసుకోవడానికి వలస వచ్చిన అనేకమంది ఇంటి దారి ఈ మతకలహాల వలన దారి పట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదలు దారుణంగా నష్టపోయారు. వారి దుకాణాలు. హోటల్లు. ఇండ్లు వంశం కావడం పూర్తిగా దగ్ధమైపోవడం వారిని తీవ్రంగా కలచివేసింది.

డబుల్ ఇంజన్ సర్కార్ల బిజెపి నేతల నుంచి ఒక్క ఓదార్పు మాటైనా వారి పట్ల చూపకపోగా ఎదురు దాడి చేస్తుండడంతో అక్కడి ప్రజలు హాతశులై వారు మరెక్కడికి పోవాలని కలవర పడుతున్నారు. మొత్తం వ్యవహారం చూస్తే ఒక పథకం ప్రకారమే అల్లర్లు సృష్టించినట్లు స్పష్టం అవుతున్నది. వాస్తవానికి ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతం అది. జూలై 31న విశ్వహిందూ పరిషత్. బజరంగ్దళ్. పరివార్ సంస్థలు రెండు దేవాలయాల మధ్య బ్రిడ్జి మండల యాత్ర ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. సాంప్రదాయకంగా ఎప్పటినుండో జరుగుతున్న ఈ ప్రదర్శన ఇటీవల కాలంలో ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. సాంప్రదాయకంగా ఎప్పటినుండో జరుగుతున్న ఈ ప్రదర్శన ఇటీవల కాలంలో ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. ఎందుకంటే బిహెచ్పి స్థానికులతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్. రాజస్థాన్ రాష్ట్రాల నుండి భారీగా జన సమీకరణ చేసి. బల ప్రదర్శనకు వేదికగా మార్చింది. ఈసారి యాత్రలో బజరంగ్దళ్ నాయకుడైన నేను మనసరు పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది. ఈ మనోసర్ భవాని జిల్లా భరత్ పూర్ లో మొన్న ఫిబ్రవరిలో గో రక్షణ పేరిట. నిస్సార్. అనే ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తి. అంతకుముందు జిమ్ లో శిక్షణ ఇచ్చే ఆసిఫ్ ఖాన్. వారి స్పాన్ అనే మెకానిక్ హత్య కేసులో నిందితులుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి పాల్గొంటారని ప్రకటించడం ముస్లిం యువతలో తీవ్ర నిరసనకు. ఆందోళనకు దారి తీసింది. వారు ఆయన పర్యటన వ్యతిరేకంగా సమీకృతం రావడానికి ప్రచారం దారి తీసింది. ఈ కథనాలు పోటాపోటీగా ఇరువర్గాలను నడిపించాయి. ఈసారి ప్రదర్శన తీవ్ర హింసకాండ కు దారి తీయవచ్చని ముందు నుంచే పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు ఆ మేరకు పోలీసు యంత్రాంగానికి ముందస్తు హెచ్చరికలు కూడా చేశారు. దేశంలో ఇప్పుడు ఉన్న వాతావరణం బిజెపి. ఆర్ఎస్ఎస్ రాజకీయ వ్యూహాల కారణంగా వాటిని పోలీసు అధికార యంత్రాంగం బేఖాతర్ చేశారు. ముఖ్యంగా చివరి రోజున మరో భజరంగ్దళ్ కార్యకర్త రెచ్చగొట్టే భాషలో దారుణమైన వీడియో సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొట్టడంతో నూహ ప్రజానికం మా రాకను కాచుకోవడానికి సిద్ధంగా ఉండాలే ఇలాంటి హెచ్చరికలు అందులో ఉన్నాయి.

హత్యలు. విధ్వంసాలు. అరాచకం ఈ నేపథ్యంలో మొదలైన ప్రదర్శనలో పరివారం కార్యకర్తలు తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టడం ఆశ్చర్యం ఏమీ లేదు. మానేసర్ రాలేదు గాని బజరంగ్ దళ్ నాయకుడైన సుందర్ జైన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సల్వార్ మహదేవ మందిర్లో పాల్గొని ఉద్రేకాలు పెంచేలా ప్రసంగాన్ని ఇచ్చారు. అంతేకాక వారు తుపాకులు. ఆయుధాలు పట్టుకుని ఉద్రిక్తతను మరింత పెంచారు. ముందే రెచ్చిపోయి ఉన్న ముస్లిం యువత వారిపై రాళ్లు విసిరారు. దాంతో భద్రత చెట్లు తాము బయలుదేరిన మొదటి గుడి దగ్గరకు వచ్చి దాచుకున్నారు. జరుగుతున్న పోలీసులు. ప్రభుత్వాధినేతలు పరిస్థితిని ఉపశమింప చేయడానికి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. పక్క జిల్లాల నుండి అదనపు పోలీసులను రప్పించి. వారి రక్షణలో మళ్ళీ ప్రదర్శకులను ముందుకు సాగించేందుకు అనుమతినివ్వడంలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు రెండున ఈ ప్రదర్శకులు వెళ్లి సెక్టార్ 57 లో ఒక మసీదు పై దాడి చేశారు. అక్కడ ఆతికేళ్ల వయసు ఉన్న ఇమామ్ ను చంపి వేసినట్లు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు దాంతోపాటు మరో మసీదుపై పెట్రోల్ బాంబులను విసిరేశారు. ఈ పరిస్థితితో అవతలి వారు మళ్ళీ వారిపై ఎదురు దాడి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పి పోవడంతో కర్ఫ్యూతో సహాయాలు విధించాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. వాహనాల దహనం. విధ్వంసం. అల్లర్లు. అరాచకం అక్కడ తాండావించాయి. జిల్లా యంత్రాంగం అయితే అక్కడి పరిస్థితులను చూసి అచేతనంగా ఉండిపోయింది. నూహా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్పై దుండగులు దాడి చేశారు. ఇద్దరూ హోం గార్డులు. నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గురుగ్రామ్ సాహ్నాలలో గాయాల పాలయ్యారు. పోతాను కోట్ల రూపాయల విలువైన ఆస్తి సర్వనాశనం అయ్యింది. వందలాది మంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఐటీ నిపుణులు కూడా హడలెత్తి స్వస్థలాలకు పయనం అయ్యారు. ఒక్కసారిగా గురుగ్రామ్ మత కలహాలతో కల్లోలం అయింది. ఇక్కడున్న బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు. దేశాల నుంచి ఆందోళన సందేహాలు పంపే పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద స్థాయిలో విధ్వంసం జరిగిందంటే దీని వెనుక పథకం ప్రకారం జరిగిన కుట్ర ఉందని ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ ప్రకటించడం గర్వనీయం. అది ఎవరన్నదే ప్రశ్న. నిజానికి ఇలాంటిది జరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతున్న అలసత్వంతో అవకాశం ఇచ్చిన ఆయన ప్రభుత్వ పాత్ర ఏమిటో ప్రకటించాలి. పైగా నిజానికి ప్రభుత్వ వివరణలు ఎక్కువగా ఎందుకు శక్తులను సంతృప్తి పరిచేందుకు తప్ప బాధిత ముస్లింలను ఓదార్చేవిగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అల్లర్లు మొదలు అయ్యాక ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాల తమ అనుమతి లేకుండా ప్రదర్శనలు జరిగినట్లు ప్రకటించడంలో ఉన్న అంతర్యం ఏమిటి. బిజెపి ఎంపీ రావ్ ఇందర్ సింగ్ మాత్రం ఎటువైపు నుంచి కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని కొంతవరకు అంగీకరించడం కోస మెరుపు. మొత్తం పైన పోలీసులు రంగంలోకి దిగి 140 మందిని అరెస్టు చేసి నేటి వరకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఉండడం దేనికి సంకేతం.

సామాజిక మాధ్యమాలు వేదికగా నూహ్ ఇన్సాకాండలో ఆందోళన కలిగించే అంశానికి వేదికగా నిలిచింది. దాదాపు రెండు వేల వీడియోలు యూట్యూబ్ ద్వారా ప్రసారమై ప్రజలలో బయోత్సవం. మత విద్వేషాలను మరింత పెంచి పోషించాయి. ఇరు మతాల వైపు నుండి విద్వేషాన్ని పెంచే విధంగా బజరంగ్ దళ్ వ్యాఖ్యలే కీలకంగా మారాయి. అవతలి వారు దాడి చేసినట్లు. అమానుషంగా ప్రాణాలు తీసినట్లు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం భజరంగ్దళ్ సాగించింది. నూహ జిల్లా పాత మేవట్ మేవా రూపురేఖలను మార్చాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొన్నది. హిందూ హంతకుల కేంద్రంగా ఉండొద్దని రెచ్చ కొట్టడంతో ముస్లిం యువకులు కొందరు హింసకు పురికొల్పే వీడియోలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా మతకలహలకు ఉసిగొలుపుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ముందు నుండి హెచ్చరిస్తున్న అధికార వర్గాలు ప్రేక్షక పాత్ర పోషించడంతో జరగాల్సిన ఘోరాలు. నష్టాలు జరిగాక నేడు సోషల్ మీడియా వీడియోలు పరిశీలించేందుకు కమిటీని నియమించడం. అందులో కొందరిపై కేసులు కూడా పెట్టారు. మరికొందరిపై దర్యాప్తు జరుగుతున్న భిన్నమైన అక్కడ ప్రజా జీవితం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందటంలో సందేహం లేదు. ఎన్నికల కోసం మత విభజన పెంచే రాజకీయాలు మరోసారి ఉధృతం అయ్యే అవకాశం దేశవ్యాప్తంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇలాంటి ఘటనలు మరోసారి రాకుండా ఉండేందుకు చైతన్యం ప్రదర్శించాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉంది.

  • రచయిత
    మంగ నరసింహులు పాడి రైతుల జాతీయ నాయకులు