ర్యాగింగ్ బూతానికి ముగ్గురు అమ్మాయిలు బలి.. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ

ర్యాగింగ్ బూతానికి ముగ్గురు అమ్మాయిలు బలి.. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ

ముద్ర ప్రతినిధి, మెదక్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ కు పాల్పడ్డ సైఫ్ ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ నర్సాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. 


ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, సంతోష్ మాట్లాడుతూ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరంలో చదువుతున్న డాక్టర్ ప్రీతి నిమ్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచిందిన్నారు. ప్రీతి ఘటన జరిగి రెండు రోజులు గడవక ముందే వరంగల్ జిల్లాలోని నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందన్నారు  జయముఖి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి రక్షిత  సీనియర్ విద్యార్థులు రాగింగ్ కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారు.  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే అమ్మాయిలు చనిపోవడానికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా నాయకులు దుర్గేష్, సాయికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.