మెడికల్ కళాశాల ప్రారంభించేలా చూడాలి

మెడికల్ కళాశాల ప్రారంభించేలా చూడాలి
  • మంజూరైన పనులు కొనసాగించాలి
  • మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ మెడికల్ కళాశాల ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన అన్ని రకాల అభివృద్ధి పనులను కొనసాగించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంజూరు చేసిన పనులు చేపడితే అందరికీ అభివృద్ధి  జరుగుతుందన్నారు. కెసిఆర్ ఫ్యాన్లు మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేస్తు 180 కోట్ల రూపాయల తరువులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కక్ష సాధింపు కాకుండా అభివృద్ధి, సంక్షేమపై దృష్టి సాధించాలన్నారు. ఎంసిహెచ్ లో 25 శాతం సానిటషన్ తగ్గించారు అది యాదవిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజల నమ్మకం వమ్ము చేయకుండా కొత్త ప్రభుత్వం, ఎమ్మెల్యే పనిచేయాలన్నారు. 

కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినందున సిరత్వం కలగడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ముందు చేసిన ఆన్లైన్ మాత్రం యధావిధిగా కొనసాగించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తామన్నారు. ఈ సమావేశంలో జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ళ మల్లికార్జున గౌడ్, జెడ్పిటిసి సుజాత, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జయరాజు, ఆర్కెశ్రీనివాస్, జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.