డీసెట్-23 నోటిఫికేషన్ మే 22 వరకు దరఖాస్తులు- ప్రిన్సిపాల్ రమేష్ బాబు

డీసెట్-23 నోటిఫికేషన్ మే 22 వరకు దరఖాస్తులు- ప్రిన్సిపాల్ రమేష్ బాబు

ముద్ర ప్రతినిధి, మెదక్: 2023-25 విద్యా సంవత్సరానికి గాను డీసెట్-23 నోటిఫికేషన్ వెలువడినట్లు మెదక్ జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శివ్వ రమేష్ బాబు తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ, పూర్వ ప్రాధమిక ఉపాధ్యాయ శిక్షణ(డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్) పొందగోరు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 25 నుండి మే 22వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చుని తెలిపారు. జనరల్ కేటగిరీ వారికి ఇంటర్మీడియట్లో కనీసం 50 శాతం మార్కులు యస్సీ, యస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హత పరీక్ష ఆన్లైలో జూన్ 1న నిర్వహిస్తారని పేర్కొన్నారు.  జిల్లా విద్యా శిక్షణా సంస్థ మెదక్ (హవెలిఘనపూర్) యందు 50సీట్లు తెలుగు మీడియం, 50 సీట్లు ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు ఉర్దూ మీడియంలలో,  డిపియస్సీలో 50 సీట్లు ఇంగ్లీష్ మీడియంలో కలిపి మొత్తం 200 సీట్లు ఉన్నాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రైవేట్ కళాశాలలో 300 సీట్లు ఉన్నాయని వివరించారు.  అప్లై చేసే అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీనాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలన్నారు. పూర్తి వివరాలకు http://deecet.cdse.telangana.gov.in చూడాలన్నారు. వివరాలకు 89412414/23 యస్. రమేష్ బాబు. ప్రిన్సిపాల్ ను సంప్రదించాలన్నారు.