మెదక్ మున్సిపాలిటీకి ఉత్తమ హరితహారం అవార్డు

మెదక్ మున్సిపాలిటీకి ఉత్తమ హరితహారం అవార్డు

ముద్ర ప్రతినిధి, మెదక్:-పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపునకు కృషిచేసినందుకు హరితహారంలో మెదక్ పురపాలక సంఘం ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం రవీంద్రభారతి, హైదరాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్‌ను సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, జయరాజు, మాజీ కౌన్సిలర్ ముత్యంగౌడ్ ఉన్నారు. హరిత అవార్డుకు మెదక్ పురపాలక సంఘం ఎంపిక కావడం పట్ల కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్ అభినందించారు.