సిద్దిపేట మున్సిపాలిటీకి హరితహారంలో ఉత్తమ సేవా పత్రం

సిద్దిపేట మున్సిపాలిటీకి హరితహారంలో ఉత్తమ సేవా పత్రం

ముద్ర  ప్రతినిధి: సిద్దిపేట సిద్దిపేట మున్సిపాలిటీ కి తెలంగాణకు హరితహారంలో ఉత్తమ సేవా పత్రం లభించింది.పర్యావరణ రక్షణ,పచ్చదనం పెంపుకు కృషి చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్ లో రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ లకు అటవీ శాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,అటవీఅభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు ఈ అవార్డును అందజేసి, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట హరితవనం అధికారి ఐలయ్య పలువురు మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ప్రోత్సాహంతో రంగనాయక సాగర్ వద్ద నాలుగు ఎకరాల్లో తేజోవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు పట్టణముతోపాటు చుట్టూరా పెద్ద ఎత్తున మొక్కలను నాటి సంరక్షిస్తున్నామని తెలిపారు అవార్డు రావడం పట్ల పట్టణ ప్రజల తరఫున హర్షం వెలిబుచ్చారు.