సిద్దిపేట, క్రీడలకు క్రీడాకారులకు మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం అభినందనీయం

సిద్దిపేట, క్రీడలకు క్రీడాకారులకు మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం అభినందనీయం

 రాష్ర్ట విద్యా,సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్  రావుల శ్రీధర్ రెడ్డి 


సిద్దిపేట:  ముద్ర ప్రతినిధి అభివృద్ధి  లో సిద్దిపేట రాష్ట్రానికే మోడల్ అని రాష్ర్ట విద్యా,సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్  రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు.. సోమవారం రోజున సిద్దిపేటలో జరుగుతున్న గర్ల్స్ హైస్కూల్ పనులను పరిశీలించారు.సాయంత్రం  పూట సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీలో పాల్గొన్నారు.కాసేపు క్రికెట్ ఆడారు, అదేవిధంగా పక్కన ఉన్న  స్విమ్మింగ్ ఫుల్, ఫుట్ బాల్ స్టేడియం, వాలి బాల్ స్టేడియం , ఇండోర్ స్టేడియంలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలకు క్రీడా కారులకు మంత్రి హరీష్ రావు దొరకడం గొప్ప వరం ఆని,ప్రజల కు ఎం కావాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమకూర్చారని కొనియాడారు.సిద్దిపేట స్టేడియం నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన గ్రినరి, ప్లడ్ లైట్స్,భారీ స్క్రీన్ ఒక అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు.ఇది నాయకుడు ప్రజల కోసం నిరంతరం తపించే తపన కు నిదర్శనం అని అన్నారు.అలాంటి పనులు సాధ్యం చేసిన నాయకుడు హరీష్ రావు అని చెప్పారు. ఒకే దగ్గర సకల క్రీడా సదుపాయాలు ఉండటం అద్బుతమని అన్నారు. సిద్దిపేట అభివృద్ధి రాష్ట్రానికే రోల్ మోడల్ అని అభివృద్ధి ఆల్ రౌండ్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వహకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మల్లి ఖార్జున్ విద్యార్తి విభాగం కో ఆర్డినెటర్ రమేష్ తదితరులు ఉన్నారు.