మైనర్ ప్రేమ జంట బలవన్మరణం

మైనర్ ప్రేమ జంట బలవన్మరణం
  • సిద్దిపేట జిల్లా లచ్చపేటలో ఘటన
  • శోకసంద్రంలో ఇరు కుటుంబాలు

దుబ్బాక,ముద్ర: మైనర్ల ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట కు చెందిన మైనర్ యువకుడు కూరపాటి  భగీరత్(17),దుబ్బాక కు చెందిన తొట్ల నెహ (16) అనే మైనర్ యువతీ దుబ్బాకలోని ఓ కళాశాలలో ఇంటర్ విద్య అభ్యసిస్తున్నారు. కళాశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ విషయం ఇంట్లో తెలిస్తే విడదీస్తారని భయంతో ఈరోజు ఉదయం లచ్చపేట గ్రామంలో దూలానికి ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఘటనతో లచ్చపేట లో,ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు.దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.