ఘనంగా పోచమ్మ తల్లికి పూజలు 

ఘనంగా పోచమ్మ తల్లికి పూజలు 

ముద్ర ప్రతినిధి, సిద్ధిపేట: సిద్దిపేటలోని సుభాష్ నగర్ పోచమ్మ దేవి ఆలయంలో రెండు రోజులపాటు నిర్వహించే బోనాల పండుగ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారికి అభిషేకము, అర్చనలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.రెండు రోజులపాటు అమ్మవారి ఆలయ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. శనివారం నాడు ఆలయం వద్ద మధ్యాహ్నం భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదానాన్ని ఏర్పాటు చేశారు