విద్యుత్ ఫోరమ్ ఆధ్వర్యంలో పరిష్కార వేదిక.. అర్జీలు సమర్పించిన వినియోగదారులు 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ట్రాన్స్‌కో సర్కిల్ కార్యాలయం  ప్రాంగణంలో  టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఫోరం -1 ఆధ్వర్యంలో బుధవారం పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఫోరం చైర్ పర్సన్ కె.దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మెంబర్ టెక్నికల్ పి.నాగేశ్వరరావులు వినియోగదారుల నుండి పలు ఆర్జీలు స్వీకరించారు.  జిల్లావ్యాప్తంగా పలువురు తమ సమస్యలపై ఫోరంకు ఫిర్యాదులు చేశారు. విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫోరంకు నేరుగా ఆర్జీలు అందజేయవచ్చని చైర్మన్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఆర్జీలు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల అధికారులకు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ఈరోజు కార్యక్రమంలో ఎస్ఈ జానకి రాములు, డిఈ కృష్ణారావ్, వినియోగదారులు పాల్గొన్నారు.