కడెం ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుంది

కడెం ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుంది
  • ఎల్లమ్మ తల్లి చూసుకుంటుందని అనటం సిగ్గు చేటు
  • కేసీఆర్ కు ప్రాజెక్టు ల పైన అవగాన లేదు: మాజీ మంత్రి ఈటెల

ఖానాపూర్, ముద్ర : ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రాజెక్టు ల పైన సరైన అవగాహన లేదని, మంత్రి దేవుడు చూసుకుంటాడని అనటం నిర్లక్ష్యం కు నిదర్శనం అని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిషన్ చైర్మన్ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఆయన సందర్శిచారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు కట్టడంలో ఉన్న ఆత్రుత పాత ప్రాజెక్టుల మరమ్మత్తులు చేపించడంలో లేదని మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు ముంపు గ్రామాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు భయం గుప్పెట్లో బ్రతకాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి ప్రాజెక్టును మరమ్మతులు చేయించి రైతాంగానికి ప్రజలకు భరోసా కల్పించాల్సిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టును దేవుడే రక్షించాలంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ఎల్లమ్మ తల్లి పేరు చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. నిధులు విడుదల చేసి పనులు చేయకపోవడం, ప్రాజెక్టు కు కనీసం మరమ్మత్తులు చేయకపోవడం విచారకరమణి అన్నారు. 3 లక్షల 36 వేల డిస్టర్జ్ కేపాసిటి ఉన్న గేట్లు పనిచేయపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. కొన్ని గేట్లు పని చేయక పోవటం, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని అన్నారు. గేట్ల పైనుండి వరద నీరు ప్రవహించే పరిస్థితి వచ్చిందంటే విషయం ఎంత దారుణంగా ఉందొ అర్థం అవుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాత ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి రైతులకు ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సదర్మాట్ కు పడిన గండ్లు పుడ్చాలని, రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని లేనిచో రైతులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. రానున్న బీజేపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల అన్ని మరమ్మతులు చేపడతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, నాయకులు రమాదేవి, నాయిని సంతోష్, ఆకుల శ్రీనివాస్, లాoడేరి కిషన్ తదితరులు పాల్గొన్నారు.