జాతరలో అధికారుల సేవలు అమోఘం

జాతరలో అధికారుల సేవలు అమోఘం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఏడుపాయల మహా జాతర విజయవంతం చేయడంలో అధికారుల సేవలు అమోఘమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.  మంగళవారం కలెక్టరేట్ లో మహాశివరాత్రి జాతర ముగింపు అభినందన సభ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు  కల్పించామని, విజిలెన్స్ బృందాలను  పెట్టి భక్తుల అభిప్రాయాలు సేకరించామని, వచ్చే జాతరకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 

అనంతరం ఏడుపాయల జాతరలో ఉత్తమ సేవలందించిన అధికారులకు, పాలక వర్గానికి, అర్చకులకు, మండల నాయకులకు తదితరులను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. 
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షలు సోములు, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జగన్, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈ.ఓ. సార శ్రీనివాస్, పాలక వర్గ సభ్యులు, మండల వైస్ ఎంపిపి విష్ణువర్ధన్ రెడ్డి, నాగ్సాన్పల్లి సర్పంచ్ సంజీవ రెడ్డి, ఎంపిటిసి,  ప్రజాప్రనిధులు తదితరులు పాల్గొన్నారు.