అటవీ కార్యాలయం ముందు గిరిజనుడు ఆత్మహత్య యత్నం

అటవీ కార్యాలయం ముందు గిరిజనుడు ఆత్మహత్య యత్నం

ముద్ర ప్రతినిధి, మెదక్:తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మెదక్ అటవీ శాఖ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా హావేలి ఘనపూర్  మండలం గంగాపూర్ తండాకు చెందిన బాధితుడు విట్టల్ అనే గిరిజన రైతు కథనం ప్రకారం...

తన భుసమస్య పరిష్కరించడానికి మంత్రి కేటీఆర్, హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. అటవీ అధికారులు ఉదయ్, కిష్టయ్య, లక్ష్మయ్యలు మూడు నెలలుగా ఇబ్బందులు పెడుతున్నారని, 2 లక్షలు డబ్బులు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.భూమి లేవల్ చేయడానికి మరో 5 దు లక్షలు ఖర్చు అయిందన్నాడు.నేను మరణిస్తే ప్రభుత్వ పరంగా రైతు బీమా వస్తుందని దానివలన అప్పులు తీరుతాయని పేర్కొన్నాడు. ఆర్డీవో ముందు బైండోవర్ చేస్తామని ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయం వద్దకు బుధవారం పిలిపించారని తెలిపాడు. తీవ్ర ఇబ్బందులు గురిచేయడంతో ఫారెస్ట్ రేంజ్   కార్యాలయంలో పురుగుల మందు తగానని చెప్పాడు. గమనించిన కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పింది.
*అటవీ భూమి ఆక్రమిస్తున్నాడు:ఎఫ్ఎస్ఓ వి