కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల ధర్నా

కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్:వేతన పెంపుతో పాటు తమ డిమాండ్ల సాధన కోసం ఆశా కార్యకర్తలు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. గురువారం మెదక్ కలెక్టరేట్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియూ నాయకులు మల్లేశం, మహేందర్ రెడ్డి, బసవరాజు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు నాయకులు సావిత్రి, ప్రభావతి, మంజుల, శాంత, పద్మ, ఎస్ఎఫ్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ఫణీంద్ర మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.