పాఠశాలల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి

పాఠశాలల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి
  • పాఠశాలల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి
  • ఎస్టియు జిల్లా అధ్యక్షులు ప్రణీద్ కుమార్ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఎస్టియు 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ ఎస్టియు భవన్ లో జిల్లా అధ్యక్షులు ప్రణీద్ కుమార్ పతాకావిష్కరణ గావించారు.  మాట్లాడుతూ పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమవుతున్నప్పటికీ పాఠశాలల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు నెలకొన్నాయన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేక పాఠశాలలు చెత్త కుప్పలుగా మారుతున్నాయి,  త్రాగునీటి వసతి అనేక పాఠశాలలో లేదన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ బడితెరిచే నాటికి పూర్తి చేయాలని, ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ జరగలేదన్నారు.

రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ ప్రభుత్వము కనీసము విద్యా వాలంటీర్లకైనా నోటిఫికేషన్ జారీ చేయకపోవడం శోచనీయమన్నారు  ఉపాధ్యాయుల  బదిలీల నోటిఫికేషన్ గత విద్యా సంవత్సరంలో వెలువడిన నేటికీ కోర్టులో నాన్చుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గొప్పగా ఇచ్చినటువంటి పిఆర్సి గడువు నేటి జూన్ తో ముగియనున్నందున జులై 1 నుండి కొత్త పిఆర్సి కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న పాటశాలలో అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి
ఎస్టియు జిల్లా అధ్యక్షులు ప్రణీద్ కుమార్ డిమాండ్.