కలెక్టరేట్ నిర్మాణ పనులపై కలెక్టర్ హరీష్ ఆగ్రహం

కలెక్టరేట్ నిర్మాణ పనులపై కలెక్టర్ హరీష్ ఆగ్రహం
Construction of new collectorate building

మెదక్, ముద్ర ప్రతినిధి: నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపట్ల జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్  ఆర్ అండ్ బి అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, డి.ఎఫ్.ఓ.తో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కలెక్టరేట్  నిర్మాణాలు పూర్తయి ప్రారంభమవుతున్నా, ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో నిర్మాణ పనులు నత్తనడకన ఇంకా కొనసాగుతుండడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ అంతా కలియతిరిగి ఇంకా అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, వాటర్ సంప్ కు వెంటనే  నీటి కనెక్షన్ ఇవ్వవ్వాల్సిందిగా మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.  అంతర్గత సిసి  రోడ్లు నాణ్యతతో వేయాలని, ప్రహారీగోడ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ ఆవరణ ఆహ్లాద వాతావరణం కనిపించేలా పచ్చదనం, చక్కటి నీడ కల్పించేలా మొక్కలు ఇప్పటి నుండే నాటవలసినదిగా జిల్లా అటవీ అధికారికి సూచించారు.  కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఈఈ శ్యామ్ సుందర్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏఈ రియాజ్,  జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఏజెన్సీ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్, సిబ్బంది ఉన్నారు.