అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా

శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ జామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి.