సూర్యాపేట అడిషనల్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు

సూర్యాపేట అడిషనల్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా అడిషనల్   సూపరింటెండెంట్   ఆఫ్ పోలీస్ (అదనపు ఎస్పి )గా  మేక నాగేశ్వరరావును నియమిస్తూ సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సూర్యాపేట డిఎస్పీగా పని చేసిన నాగేశ్వరరావు ప్రమోషన్ పై అదనపు ఎస్పీగా సూర్యాపేటకు రావడం విశేషం. గతంలో ఇక్కడ పనిచేసిన సమయంలో అందరి  ఆదరాభిమానాలు పొందిన డీఎస్పీగా నాగేశ్వరరావు  పేరు పొందారు.