ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి , కోదాడ:-నియోజకవర్గ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఐజెయు యూనియన్ రిపోర్టర్లు కోదాడ మార్కెట్ కమిటీ గెస్ట్ హౌజ్ నందు కేక్ కట్ చేసి , ఫ్రెండ్ షిప్ బ్యాన్డ్స్ కట్టుకొని ఘనంగా నిర్వహించారు . ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ సాక్షి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాధారణ సమావేశం అనంతరం , స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు పిడమర్తి. గాంధీ , దాడుల కమిటీ అధ్యక్షుడు బాదె. రాము , సీనియర్ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి హరనాధ్ పలువురు యూనియన్ రిపోర్టర్లు పాల్గొన్నారు .