జిల్లాకు స్వచ్ సర్వేక్షన్ లో అవార్డులు

జిల్లాకు స్వచ్ సర్వేక్షన్ లో అవార్డులు

అవార్డు పొందడానికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ అభినందనలు - జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లాకు  మరో రెండు గ్రామ పంచాయతీకు రాష్ట్ర స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు లభించాయాని  జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన అభివృద్ధి, పరిశుభ్రత వలన  స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డులు -2023  జిల్లాలోని గరిడేపల్లి మండలం పోనుగొడు జి.పి  అలాగే మునగాల మండలం గణపవరం గ్రామ పంచాయతీల కు అవార్డులు దక్కాయని  14న రాష్ట్ర గ్రామీనాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఆలాగే mpo లు,  డిఆర్డీఏ, సి.ఈ. ఓ, డి.పి.ఓ , ఎస్బియమ్ లు అవార్డు అందుకొనున్నారని ఈ సందర్బంగా కలెక్టర్ వారిని అభినందించారు.