ఎయిర్‌పోర్టులో జెడ్డా నుంచీ వచ్చిన ప్యాసింజర్ వధ  కోటి విలువ చేసే బంగారం పట్టివేత

ఎయిర్‌పోర్టులో జెడ్డా నుంచీ వచ్చిన ప్యాసింజర్ వధ  కోటి విలువ చేసే బంగారం పట్టివేత

  • దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వధ 77 లక్షలు విలువ చెసే బంగారు స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచీ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు ఇండిగో విమానంలో శంషాబాద్‌‌కు వచ్చారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా వారి వద్ద రూ. కోటి విలువ చేసే అక్రమ బంగారం లభ్యమైంది. దీంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. ప్రయాణికుల వద్ద ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారం పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్క సమాచారంతో కస్టమ్స్ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు. నింధితుల వద్ద పట్టు బడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1.11 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నింధితులను విచారిస్తున్నారు.

  • దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వధ 77 లక్షలు విలువ చెసే బంగారు స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  దుబాయ్ నుంచి వచ్చిన వేరు వేరు విమానాల్లో వచ్చిన నలుగురు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న బంగారం తీసుకు వస్తుండగా  కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రూ. 77.02 లక్షల విలువ చేసే బంగారాన్ని గోల్డ్ చైన్లు,బిస్కెట్లు, పేస్టు రూపంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వాటి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.