ప్రభుత్వ భూములు అమ్మకం కు నిరసనగా ఆందోళన

ప్రభుత్వ భూములు అమ్మకం కు నిరసనగా ఆందోళన
  • కోకపేట లో బి జె పి నేతల  ఆందోళన, అరెస్ట్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-కోకాపేట, బుద్వేల్ తధితర  ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అమ్మకం కు నిరసనగా B j p ఆందోళన ప్రథమ పఠింది. ఆదివారం కోకాపేట బి జె పి నేత లూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూములు అమ్మకం కు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.  నిరసన వ్యక్తం చేస్తున్న బి జె పి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్బంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా  నరసింహా రెడ్డి  మాట్లాడుతూ  మంత్రి కెటిఆర్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ భూములు సేల్ చెయ్యడానికి ప్లే కార్డ్స్ పట్టుకొని ఆందోళన చేసి నేడు  తెలంగాణ రాష్ట్రం లో నీ విలువిన భూములు నీ అమ్మకాని పెట్టడం ఎంతవరము సమంజసమని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా ప్రభుత్వం అమ్ముకుంటుందన్నారు. మున్ముండు ప్రజా అవసరాలకు కుడా భూములు లేకుండా ప్రభుత్వం అమ్ముతుందన్నారు. నార్సింగి, బండ్లగూడ, కోకాపేట్, రాజేంద్ర నగర్ ప్రాంతంలోని విలువైన భూములు ప్రభుత్వ విచ్చలవిడి అమ్ముతుందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా నూ కేవలం ప్రభుత్వ ఖజానాకు అధాయ వానరు గా చూస్తుండని విమర్శించారు. బి జె పి  తరుపున ప్రభుత్వ భూములు  అమ్మకం ను వ్యతిరేకిస్తునామని అన్నారూ. ప్రభుత్వ భూములు విక్రయానికి వ్యతిరేకంగా  ఆందోళన కార్యక్రమం చేపడతాం అని అన్నారు.ఈ కార్యక్రమములో బి జె పి నాయకులు అంజన్‌కుమార్ తదితరులు ఉన్నారు.