భగ్గుమన్న భూ తగాదాలు

భగ్గుమన్న భూ తగాదాలు
  •  ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ
  • ఇద్దరికి తీవ్ర గాయాలు

ముద్ర ప్రతినిధి,రంగారెడ్డి:-వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల గ్రామంలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది.ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.204 సర్వే నంబర్ లోని దాదాపు మూడెకరాల పొలం విషయంలో రైతు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది.అరవై ఏళ్ళుగా భూమి మేమే సాగు చేస్తున్నామని ఓ వర్గం రైతులు చెబుతుంటే...తమ భూమిని దౌర్జన్యంగా లాక్కుని అనుభవిస్తున్నారని మరో వర్గం రైతులు అంటున్నారు...ప్రభుత్వ సర్వేలో ఆ భూమి తమదేనని తేలిందని మరో వర్గం రైతులు చెబుతున్నారు.ఓ వర్గానికి బీఆరెస్స్ నాయకులు.... మరో వర్గానికి కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తుండటంతో భూ సమస్య కాస్తా రాజకీయ పోరుగా మారింది.