ఆదిభట్ల ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్ లో అగ్నప్రమాదం

ఆదిభట్ల ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్ లో అగ్నప్రమాదం
  • టీసీఎస్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ తో ఘటన
  • దగ్ధమైన ఏసీలు ఫర్నిచర్స్ విద్యుత్ పరికరాలు
  • సుమారు రూ.20 లక్షల మేర నష్టం

ఇబ్రహీంపట్నం, ముద్ర : ఆదిభట్ల మున్సిపల్ కేంద్రంలోని టీసీఎస్ సమీపంలోని ద ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, నిర్వాహకుల తెలిపిన ప్రకారం వివరాలు.. ఆదిభట్ల టీసీఎస్ సమీపంలో ఉన్న దా ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్ లో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తీవ్రమైన పొగ బయటకు వస్తుండడంతో గమనించిన స్థానికులు రెస్టారెంట్ యజమాన్యానికి ఫోన్ లో సమాచారం ఇచ్చారు. దాంతో తన రెస్టారెంట్ లో పని చేసే సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. రెస్టారెంట్ తలుపులు తీసి చూడగా మంటలు ఎగిసిపడుతున్నాయి, దీంతో రెస్టారెంట్ పూర్తిగా పొగతో నిండిపోయింది. వెంటనే స్థానిక ఫైరింగ్ అధికారులకు సమాచారం అందించారు. ఫైరింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే రెస్టారెంట్ లో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. రెస్టారెంట్ కు సంబంధించిన పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. అందులోని ఐదు ఏసీలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక్కసారిగా ఎగిసిన మంటలకు ఫాల్ సీలింగ్ పూర్తిగా దగ్ధమైంది.

టేబుల్స్, లైట్స్, ఫర్నిచర ఫర్నిచర్ కాలి బూడిదవడంతో సుమారు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు రెస్టారెంట్ యజమానులు తెలిపారు. అయితే కిచెన్ కు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లే. ఒకవేళ కిచెన్ కు మంటలు అంటుకుంటే గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం జరిగేది. స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఏసీల షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.