బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి అరెస్ట్

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి అరెస్ట్
  • సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం
  • బండి సంజయ్ అరెస్ట్ కు నిరాసన

ఇబ్రహీంపట్నం, ముద్ర: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ కు  నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిభోమ దహనం చేయదానికి యత్నించిన రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు  బొక్కా నరసింహా రెడ్డి తో పాటు బీజేపీ కార్యకర్త లా ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అబ్దులపూర్ మెట్ చౌరస్తా లో శాంతి యుతంగా నిరసన లో భాగంగా , కెసిఆర్ దిష్టి బొమ్మ ను దహనాని అడ్డుకుని బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి ని  అరెస్ట్ చేసి పోలీసు వాహనం లో అబ్దులపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి మాట్లాడుతు తెలంగాణ లో పదవ తరగతి ప్రశ్న పత్రాల లీక్ తో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు సంబంధం ఉందని రాత్రికి రాత్రి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాని  తీవ్రంగా ఖండించారు. రాజకీయం గా బిజెపి ని ఎదురుకోలేకనే బండి సంజయ్ ను అరెస్ట్ చేసారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన నడుస్తుందని అన్నారు. బి ఆర్ యస్ పార్టీ కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందని. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడని చూడకుండ అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. తెలంగాణ రాష్టాన్ని లిక్కర్ రాజ్యం - లీకుల రాజ్యం గా మార్చారని ధ్వజమేతారు. 

ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు పాపయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, కార్యదర్శి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు జంగమ్మయ్యా గౌడ్, మండల అధ్యక్షులు బండి గారి విష్ణు, బడిగే గోవర్దన్, కౌన్సిలర్ శ్రీలత, యువ మోర్చా సాయి, మండల ప్రధాన కార్యదర్శి, శ్రవణ్, సురేష్, యాదగిరి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు