ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు ఉరి

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు ఉరి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మంచిర్యాల లో ముఖ్యమంత్రి కేసీఆర్ గడ్డిబొమ్మను బీజేపీ శ్రేణులు ఉరి తీశారు. బుధవారం సంజయ్ అరెస్టు వార్త తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆందోళన కు దిగారు. ఐబీ చౌరస్తా లో బీజేపీ శ్రేణులు స్థంబానికి కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి తీసి వేలాడ తీశారు. మరోవైపు హమాలివాడ లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయాలని ప్రయత్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావును పోలీస్ లు అరెస్టు చేశారు. ముఖ్య నేతలను పోలీస్ లు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టులు చేశారు. జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది.