ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : ఇంటర్మీడియట్ విద్యార్థిని మనస్థాపంతో సూసైడ్ కు పాలుపడింది. మణికొండ పరిధి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో శాంతకుమారి అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఐదో అంతస్తు నుండి కిందకు దూకింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.