రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన్మయత్వ నృత్యం

రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన్మయత్వ నృత్యం

ముద్ర, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  శివారులోని చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన  కార్యక్రమాలకు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తుల భజనలు ఆధ్యాత్మిక పాటలకు పరవశించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భజనలతో నృత్యం చేశారు ..