సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్ల సొగసు చూడతరమా...!

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్ల సొగసు చూడతరమా...!
  • చిన్నపాటి చిరుజల్లులకే చిత్తడి చిత్తడిగా రోడ్లు
  • దెబ్బతింటున్న ప్రజల వాహనాల ఆరోగ్యం
  • అధికారుల మొద్దు నిద్ర
  • గతుకుల మయంగా ఎన్ టి ఆర్ పార్క్ , శ్రీరామ్ నగర్,  విద్యానగర్ రోడ్లు
  • మరమ్మతులు చేపట్టాలని ప్రజల వినతి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేటజిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్లన్నీ గుంతల మయంగా మారిపోయాయి. చిన్న చినుకులకే చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి గుంతల రోడ్లపై ప్రయాణాలు వాహనదారులు వాహనాల పాలిట శాపంగా మారుతున్నాయి జాతీయ రహదారి జిల్లా కేంద్రంలోని పెద్ద రోడ్లు తప్పిస్తే ఆయా కాలనీలోని చిన్నచిన్న రోడ్లన్నీ కూడా గుంతలతో నిండిపోయాయి ఆయా కాలనీలోని రోడ్లు ఎత్తుపల్లాలు ఉండి గుంతలు పడి కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకపోవడంతో ఆ రోడ్లపై ప్రయాణం ప్రజలకు నరకప్రాయంగా మారింది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కౌన్సిలర్ జహీర్ ఇంటి దగ్గర నుంచి సిసి రోడ్డు తర్వాత 16వ వార్డు నుండి 60 ఫీట్ల రోడ్డు ఎక్స్టెన్షన్ మీదుగా ముత్యాలమ్మ గుడి సమీప నుండి ఖమ్మం రోడ్డు పెట్రోల్ బంకు పోయేవరకు  రోడ్డు మొత్తం గుంటలు పడి కంకర దేవి నానా బీభత్సంగా ఉంది. గత ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా పాలకులు అధికారులు ముఖ్యమంత్రి మాటలను సైతం గాలికి వదిలేసి రోడ్డు వేయలేదు. అలాగే జాతీయ రహదారి చిన్న అండర్ పాసింగ్ నుండి ఎమ్మెస్ కిడ్స్ రామ్మూర్తి హాస్పటల్, విద్యానగర్ మీదుగా ఏపూరు బస్టాండ్ వరకు వెళ్లే రోడ్డు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది అలాగే జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసినప్పటికీ ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి ఎగుడు దిగుడుగా ఉండడం ముందు వేసిన రోడ్డుకు సమాంతరంగా ఇతరుల రోడ్డు కూడా ఏయే పోవడం వల్ల వాహనాలన్నీ గుద్దుకొని ప్రజల ఆరోగ్యాలు గుల్లవుతున్నాయి.

మంజునాథ వైన్స్ నుంచి బ్రాహ్మణ కళ్యాణ మండపం పక్కన, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు కుడకుడ నుంచి ఖమ్మం రోడ్డు అమ్మ గార్డెన్స్ వరకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డు కూడా గుంతలతో నిండి ఉంది. నిత్యం రద్దీగా ఉండే కుడ కుడ రోడ్డు నుండి రిలయన్స్ డిజిటల్ ఎదురుగా టీచర్స్ కాలనీ నుండి బాలాజీ నగర్ వచ్చే రోడ్డు ఎంఎల్ పార్టీ ఆఫీస్ రోడ్డు, నల్లాల బావి నుండి విద్యానగర్ రామలింగేశ్వర దేవాలయం వచ్చే రోడ్డు, నల్లాలబావి నుండి అలంకార థియేటర్ రోడ్డు మీదుగా సిపిఎం ఆఫీస్ రోడ్డు మీదుగా చేపల మార్కెట్ నుండి కూరగాయల మార్కెట్ కు వచ్చే రోడ్లు గుంతల మయంగా మారాయి. మెయిన్ రోడ్ నుండి తాసిల్దార్ కార్యాల నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ ఇటు రాజీవ్ నగర్ వరకు అలాగే పాత బస్టాండ్ నుండి కృష్ణ థియేటర్ వెళ్లే ముత్యాలమ్మ గుడి సందు రోడ్డు గుంతలతో నిండిపోయింది. నిర్మల హాస్పిటల్ నుండి వాటర్ ట్యాంకు రైతు బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు వచ్చే సీసీ రోడ్డు కూడా అక్కడక్కడ  ప్యాచ్లు తేలి గుంతలు పడ్డాయి.

'మెడికల్ కళాశాల పక్కన  ఎన్ టి ఆర్ పార్క్ దగ్గర కాలువ నిర్మాణం  చేశారు. కాల్వ  కట్టిన తరువాత రోడ్ గతుకుల మయంగా మారింది.అధికారులు శీత కన్ను తో వాహన చోదకులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.బండ్లు  దిగబడి వాహనాల చోదకులు గాయాల పాలవుతున్నరు. ప్రధానంగా రాత్రి సమయంలో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పాలవడమే కాకుండా గోతుల్లో పడి గాయాల పాలవుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శంకర్ విలాస్ నుండి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అయ్యప్ప షాపింగ్ మాల్ ముందు, కూరగాయల మార్కెట్ నుండి శంకర్ విలాస్ జంక్షన్ వద్ద, జి షాపింగ్ మాల్ ముందు,అదే సందులో కెనరా బ్యాంక్ కూరగాయల మార్కెట్ జంక్షన్ గుంతలతో నిండిపోయింది.

పాలకులకు పట్టింపు లేదా అధికారులకు నిర్లక్ష్యం తోడైందా...!

జిల్లా కేంద్రంలోని అంతర్గత రహదారులు ఈ విధంగా గుంతలు పడి ప్రయాణం వాహనదారుల ఆరోగ్యం గుల్ల అవుతుంటే దీనికి కారణం ఎవరు? పర్యవేక్షణ లేని  పరిపాలకులదా, పరిపాలకుల మాట కూడా లెక్కచేయని అధికారులు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లు సుందర సూర్యాపేట గా ఉంటే పైన పటారం లోన లొటారం అన్న చందంగా ప్రధాన రోడ్లు మెలమెలా మెరుస్తుంటే అంతర్గత రోడ్లు వెలవెలబోతున్నాయి.

ప్రతివారు ఎప్పుడు ప్రధాన రోడ్ల మీదనే ప్రయాణం చేయరు కదా తమ ఇళ్లకు చేరుకోవాలంటే కాలనీలో  రోడ్లకు రావాల్సిందే కదా. తాము నివసించే ఇంటి నుంచి ప్రధాన సహార గారికి ఈ అంతర్గత  లింకు రోడ్లే కదా ప్రయాణానికి ఉన్న ఏకైక మార్గం. అలాంటప్పుడు నిత్యం రద్దీగా ఉండే అంతర్గత లింకు రోడ్లు ఎలాంటి గుంతలు లేకుండా ఉంటే ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తున్నందున చాలా సులువుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు లేదంటే ప్రమాదాలు జరిగి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో పాలై వాహనాలు రిపేర్లు పాలై ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అంతర్గత రోడ్ల విషయంలో  సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి తక్షణ ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన గుంతల మాయమైన రోడ్లన్నీ బాగు చేయించాలని వీలుంటే కొత్త రోడ్లు వేయించాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రజలు కోరుతున్నారు.