కల్నల్  సంతోష్ ఆశయాలు సాధించాలి

కల్నల్  సంతోష్ ఆశయాలు సాధించాలి

కల్నల్  సంతోష్ ఆశయాలు సాధించాలి- మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ, ముద్ర: చైనా సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి దేశ రక్షణలో  ప్రాణ త్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు పేరు సూర్య చంద్రులు ఉన్నంతవరకు సజీవంగా ఉంటుందని మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో  పట్టణంలోని సూర్యాపేట రోడ్ లో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వీరమరణం పొందిన సంతోష్ బాబు తెలుగు వారు కావడం మన అందరికీ గర్వకారణం అన్నారు. వీరమరణం పొందిన సంతోష్ బాబు సూర్యాపేట జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా చాటారని కొనియాడారు. సంతోష్ బాబు ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిపిరిశెట్టి సుశీల రాజు , వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ జగనీ ప్రసాద్ , ఆర్యవైశ్య నాయకులు గరినే శ్రీధర్ ,వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు బెలిదే భరత్ కుమార్ ,దొంగరి బాబు ,బుడిగం కిరణ్ ,ఉప్పల నవీన్ , యదా కిరణ్ ,భరత్ చంద్ర , బండారు శ్రీనివాసరావు , సాయి , వెంపటి ప్రసాద్ , రంజిత్ , పైడిమర్రి సతీష్ , రామారావు , పోలిశెట్టి సతీష్,తదితరులు పాల్గొన్నారు.