మొక్కలను మనం సంరక్షిస్తే అది మనలను రక్షిస్తాయి

మొక్కలను మనం సంరక్షిస్తే అది మనలను రక్షిస్తాయి
  •   హరితహారంతో నేడు తెలంగాణలో వర్షాలు
  •  48వ వార్డులో వాటరింగ్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట :మొక్కలను మనం సంరక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం వాటరింగ్ డే సందర్భంగా 48వ వార్డులో కౌన్సిలర్ వెలుగు వెంకన్నతో కలసి హరితహారం మొక్కలకు నీళ్లు పోసి సంరక్షణ చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంతో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మరి మండు వేసవిలో నీడనిస్తూ వర్షాలు కురిపిస్తున్నాయని అన్నారు. ఆయా వార్డుల్లో ప్రజాప్రతినిధులు మొక్కలను సంరక్షించడంలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి రామానుజుల రెడ్డి, 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న, 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహజన్, 48వ వార్డు అభివృద్ధి అధికారి అజిమొద్దిన్, , టిఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు బొమ్మిడి అశోక్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.