గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలి - బెజవాడ వెంకటేశ్వర్లు

గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలి - బెజవాడ వెంకటేశ్వర్లు

హుజూర్ నగర్, టౌన్, ముద్ర: తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి  5 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లయిన కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా గృహలక్ష్మి పథకం పేరుతో ఇంటి స్థలం ఉన్నవారికి మూడు లక్షలు ఇస్తామని ప్రకటించి ప్రస్తుతం ఉన్న స్టీలు సిమెంట్  విపరీతంగా పెరిగిపోవడం వలన  ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు, పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా సమితిసభ్యుడు యల్లావుల రమేష్ ,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శీను, జక్కుల శీను, రమణ పాల్గొన్నారు.