విమోచన దినోత్సవం, కాంగ్రెస్ 5g ప్రోగ్రాం పై  మంత్రి జగదీష్ రెడ్డి ద్వజం

విమోచన దినోత్సవం, కాంగ్రెస్ 5g ప్రోగ్రాం పై  మంత్రి జగదీష్ రెడ్డి ద్వజం
  • విమోచనం పై అమిత్ షా లేని అపోహలను సృష్టిడటం దురదృష్టకరం
  • పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని వారుర్ చేసెట్ ప్రయత్నాలు దుర్మార్గం
  • దేశ మనుగడకు అలాంటి వారు ప్రమాదకరం
  • ఓట్ల రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు
  • ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టే చైతన్యం తెలంగాణా సమాజానికి ఉంది
  • కర్ణాటకలో ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ కి ఓటు వేశారు
  • కర్ణాటకలో ఒక్క హామీ కూడా నెరవేర్చక కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపెట్టింది
  • సోనియా , రాహుల్ లు ఎం చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : విమోచనం పై అమిత్ షా తో పాటు కొంతమంది లేని అపోహలను సృష్టించడం  దురదృష్టకరం అని  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ద్వజమెత్తారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి,పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని దుర్మార్గం చూస్తున్న అలాంటి వారు దేశ మనుగడకు  ప్రమాదకరం అన్నారు.ఓట్ల రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.ఎన్ని కుట్రలు చేసినా  సిఎం కేసీఆర్ నాయకత్వం లో కుట్రలను తిప్పికొట్టే చైతన్యం తెలంగాణా ప్రజలు ఉంది అన్నారు. ఇక కర్ణాటకలో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయం లేక నే ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారు అన్నారు.

కర్ణాటకలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, కాంగ్రెస్ తన అసలు స్వరూపం బయటపెట్టింది అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ గత చరిత్ర ప్రజలకు తెలుసు అన్న మంత్రి సోనియా , రాహుల్ లు ఎం చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు.కాంగ్రెస్ పార్టీవి పగటి కలలే అవుతాయని ఎద్దేవా చేశారు.