ఉత్తమ పురపాలక సంఘంగా సూర్యాపేట అవార్డు అందుకున్న కమిషనర్ రామానుజుల రెడ్డి

ఉత్తమ పురపాలక సంఘంగా సూర్యాపేట అవార్డు అందుకున్న కమిషనర్ రామానుజుల రెడ్డి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులలో సూర్యాపేట పురపాలక సంఘం ఉత్తమ పురపాలక సంఘంగా ఎన్నికయింది. సూర్యాపేట లో అవలంభిస్తున్న ఘన వ్యర్ధ , ప్లాస్టిక్ వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో ఇంటింటికి తిరిగి ట్రాక్టర్లు ఆటోల ద్వారా మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రజల నుండి తీసుకుంటున్న చర్యలలో భాగంగా     స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన స్టేట్ అవార్డు సూర్యాపేట మున్సిపాలిటీ దక్కించుకుంది. అపార అనుభవం గల మున్సిపల్ కమిషనర్ సరైన క్రమశిక్షణతో సిబ్బందిని అను నిత్యం అప్రమత్తం చేస్తూ ఘన ప్లాస్టిక్ వ్యర్ధాలను ఒక శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించి సేకరించడంతో రాష్ట్రస్థాయిలో సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపుతో పాటు ఉత్త మున్సిపాలిటీగా రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ కమిషనర్ రామానుజుల రెడ్డి అకుంఠిత దీక్ష మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఈ అవార్డును దక్కించుకోవడం పలువురికి ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా  నిలుస్తున్నారు. ఇంటింటికి తిరిగి చెత్తని స్వీకరించడమే కాకుండా చెత్తను రెడ్యూస్ రీసైకిల్ రియూస్ (RR R) పద్ధతిలోకిలో ఒక్కంటికి ఐదు రూపాయల చొప్పున కొనడం సేకరించిన ప్లాస్టిక్ నుండి పైపులు ఇటుకలు ఇతర పదార్థాలు తయారు చేయడంతో సూర్యాపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రస్థాయి అవార్డును సోమవారం రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర దేవాదాయ,న్యాయ,ఫారెస్ట్ ,ఎన్విరాన్ మెంట్ శాఖా మాత్యులు అల్లోల.ఇంద్రకరణ్ రెడ్డి  నుండి  సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ పెడబలి రామానుజుల రెడ్డి స్వీకరించారు. ఇంతటి గొప్ప అవార్డును సాధించడం పట్ల మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డికి మున్సిపల్ సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు.