సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం.. అత్యధికంగా తొగుటలో 163 మిల్లీమీటర్ల వర్షం

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం.. అత్యధికంగా తొగుటలో 163 మిల్లీమీటర్ల వర్షం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలో 1552.2 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది.జిల్లాలోని  తొగుట మండల పరిధిలో అత్యధికంగా 163.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి.వీటిలో ఒక్క మార్కుకు మండలం లో మాత్రమే వర్షపాతం నమోదు కాలేదు.మిగతా 25 మండలాలలో వర్షపాతం నమోదైంది.

సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో116.6 మిల్లీమీటర్లు,సిద్దిపేట రూరల్ మండలం లో 72.2  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తొగుట మండల పరిధిలో 163.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.దుబ్బాక లో 81 మిల్లీమీటర్లు,చిన్న కోడూరు 46.8 ,బెజ్జంకి 45 ,కో హెడ 14.6, హుస్నా బాద్ 28.2, అక్కన పెట 55.4, నంగునూరు 46.4, మిరిదొడ్డి 126, దౌలతాబాద్ 30.2,రాయపోలు 21.8,వర్గల్ 9.2,ములుగు 30, జగదేవపూర్ 3.2, గజ్వేల్ 6.8, కొండపాక 130.8, కొమురవెల్లి 110.2, చేర్యాల 96.4, మద్దూరు 87.4, నారాయణరావుపేట 38.8, దూల్మిట్ట125, అక్బర్ పేట- భూంపల్లి 62.5, కుకునూరుపల్లి12.5, వర్షపాతం నమోదయింది. వరి నార్లు పోసిన రైతులకు ఈ వర్షం ఎంత ఊరటనిచ్చింది.