విద్యార్థులకు ఏకరూప దుస్తులు రాగిజావ పాఠ్యపుస్తకాలు అందజేత

విద్యార్థులకు ఏకరూప దుస్తులు రాగిజావ పాఠ్యపుస్తకాలు అందజేత

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యను నిరుపేదలకు అందే విధంగా కేజీ టు పీజీ విధానాన్ని అమలు చేస్తున్నారని ఉమ్మడి జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు .తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం చేపట్టిన విద్యా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాగి జావ ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలను అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి మండలంలోని ఐదు గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసాతుల కల్పనకు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కృషి చేశారని అన్నారు .గతంతో పోలిస్తే నేడు ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగయ్యాయని క్రమంగా విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారని అన్నారు. గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థులు నాణ్యమైన విద్యా సౌకర్యాలు పొందుతున్నారని అన్నారు .ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో గురుకుల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం మెరుగైన వసతులు కల్పించడం జరిగిందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోయిని లింగయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్  గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ దేవాలయ చైర్మన్ ముత్యాల వెంకన్న గుండ గాని రాములు గౌడ్, చెరుకు పరమేష్ బత్తుల జలంధర్ తదితరులు పాల్గొన్నారు.