బీసీలలో రాజకీయ చైతన్యం రావాలి

బీసీలలో రాజకీయ చైతన్యం రావాలి
  • సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, కెసిఆర్ కు అహంకారం ఎక్కువైంది
  • ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలి
  • పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు
  • సామాజిక న్యాయం సోనియాగాంధీతో సాధ్యం
  • మాజీ ఎంపీ, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: బీసీలలో రాజకీయ చైతన్యం రావాలని పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతరావు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జే ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  బీసీల ఐక్యవేదిక సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.ప్రజల యొక్క బాధలు తెలుసుకోవడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఉద్దేశంతో కృతనిచ్చేడై ఉన్నాడని అన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు ఓట్లేస్తేనే గెలిచేపరిస్థితి తెలంగాణలో ఉన్నదని, తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి కోల్పోవడానికి గల కారణాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీలను గ్రహించి బీసీలకు జనాభా తమాషా ప్రకారంగా సీట్లు కేటాయించడా నికి సిద్ధంగా ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 54 శాతం బీసీలు ఉంటే కేవలం బీసీలను సర్పంచి, ఉపసర్పంచి, ఎంపీటీసీ స్థానాలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టాలెంట్ అనేది ఎవరి సొమ్ము కాదని పార్టీలో బీసీలకు రిజర్వేషన్ అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ఇందిరమ్మ ఇల్లు, వికలాంగుల పింఛన్, బ్యాంకుల జాతీయ కరణ, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీసీ అనే కులం మీద పోరాడితే రాజ్యాధికారం అనేది సులభంగా దక్కుతుందని, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని ఏ పార్టీ అయినా బీసీ ఓట్లు ఉంటే గెలుస్తుందని తెలిపారు.

దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సే ను బిజెపి ప్రభుత్వం దేవుడు అంటుందని ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణలో అధికారం తీసుకువచ్చి సోనియాగాంధీకి కృతజ్ఞతగా ఇచ్చే విధంగా ప్రజలు గెలిపించాలన్నారు. టిఆర్ఎస్,బిఆర్ఎస్ గా మారినప్పుడే కేసీఆర్ పని అయిపోయిందన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇచ్చే వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కేటాయించే పరిస్థితి ఉన్నది, ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద సిబిఐ ఎంక్వయిరీలు ఉంటాయన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని దీనికి సంపూర్ణ మద్దతు బీసీలందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలన్నారు. బీసీ లందరూ ఏకమైతే సాధించడానికి రాజకీయం చాలా సులువైనది తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకు సుధాకర్, బీర్ల ఐలయ్య, అనురాధ కిషన్ రావు, నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, లక్ష్మణ్ యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శులు బీర్ల ఐలయ్య,పున్న కైలాష్ నేత,రాపోలు జయప్రకాశ్, పిసిసి సభ్యులు కృష్ణయ్య, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు, నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు సిరాజ్ ఖాన్,తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, భువనగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు తంగేళ్లపల్లి రవి కుమార్, సీనియర్ ఓబీసీ నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.