సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సభ్యుల నిర్మల్ సందర్శన

సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సభ్యుల నిర్మల్ సందర్శన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ , ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సభ్యులతో కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలకు, కేజీబీవీలకు మౌలిక వసతులు ఏర్పాటుపై చర్చించారు. అనంతరం నిర్మల్ కొయ్య బొమ్మలు, కేజీబీవీ నిర్మల్, సొన్ పాఠశాలలను,రామ్ నగర్ లోని అంగన్వాడి పాఠశాల, జీసిసి కేంద్రం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా టిఎస్ఐజి డైరెక్టర్ అర్చన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ కార్యక్రమాలను చేపట్టబోతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా కేజీబీవి పాఠశాలలో పిల్లలకు సంబంధించిన మౌలిక వసతులు అవసరమని గుర్తించడం జరిగిందన్నారు. ఐటీసీ కంపెనీ హెడ్ ఉమాకాంత్ మాట్లాడుతూ, స్వచ్చ నిర్మల్ ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పాఠశాలలు అదేవిధంగా ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి అదేవిధంగా గ్రామాలు, పట్టణాలు రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలని, మన పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి , నిర్మల్ మునిసిపల్ కమిషనర్ రాజు డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంబాజీ , మండల విద్యాధికారి కే. శంకర్ , సంజిత పాల్గొన్నారు.