పుస్తక పఠనం అలవాటు కావాలి

పుస్తక పఠనం అలవాటు కావాలి

 ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పాఠశాల దశలోనే విద్యార్థులు పుస్తక పఠనం అలవాటుగా మార్చుకోవాలని లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ వి.తిరుమల శ్రీనివాస్ అన్నారు. సోమవారం యూపీఎస్ నమిలికొండ పాఠశాలలో ఆయన గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠ్య పుస్తకాలే కాకుండా గ్రంథాలయ పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు తిరుమల శ్రీనివాస డిక్షనరీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కే రమేష్, ఉపాధ్యాయులు టీ.నీలకంఠం, ఎస్ కుమార్ స్వామి, ఏ.రాంగోపాల్రావు, డి. శోభ తదితరులు పాల్గొన్నారు