అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన

అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన
  • అర్హత లేనివారికి  పేదలకు డబల్  బెడ్ రూమ్ఇండ్లుఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకున్న పేదలు
  • సిపిఎంజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపెళ్లి సైదులు పైక్రమశిక్షణ కోల్పోయి సహనం నశించి దాడి చేసిన మోతే ఎస్సైమహేష్ 
  • సూర్యాపేట జిల్లామోతే మండలం విబాలాపురం  గ్రామంలో ఘటన తీవ్ర ఉద్రిక్తత

మోతే ముద్ర: అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని విబలాపురం  గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న ప్రజలపై పోలీసులు దాడి చేశారు.  గతంలో విబలాపురం పురం గ్రామంలో మొదటి లిస్టులో అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసిన అధికారులు తరువాత రెండవ లిస్టు తయారుచేసి అర్హులైన పేదలకు ఇవ్వకుండా అనహర్వులైన పేదలకు, బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల కు కేటాయించి రాత్రికి రాత్రే అక్రమంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి ప్రవేశింప చేసి శుక్రవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య చేతుల మీదుగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

దీంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన తర్వాతనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ఆందోళన చేశారు. ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వేచి చూసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాకపోవడంతో పేదలు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గేటు వద్ద పెద్ద ఎత్తున పేదలు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో  కోపోద్రిక్తుడైన మోతే ఎస్సై మహేష్ కానిస్టేబుల్ నాగయ్యలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు పై మూకుమ్మడిగా  దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు పేదలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యవాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న తనపై ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండల స్థానిక బిఆర్ఎస్ నాయకుల సూచన మేరకు నాపై దారుణంగా దాడి చేశారని విమర్శించారు.

దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మోతే ఎస్సై బి ఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా వ్యవ హారిస్తూ నీ సంగతి చూస్తా నా కొడకా అంటూ బూతులు తిడుతూ దాడి చేశాడని నాపై జరిగిన దాడిని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు. నాపై ,ప్రజలపై దాడి చేసిన మోతే ఎస్సై మహేష్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మోతే మండలంలో విబలాపురం రావి పహాడ్ మోతే గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల నుండి 7000 చొప్పున వసూలు చేశారని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో జరిగిన అవినీతి అక్రమాలను జిల్లాస్థాయి అధికారులకు అనేకసార్లు విన్నవించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పట్టించుకోలేదన్నారు.

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసేంతవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముల్కూరి గోపాల్ రెడ్డి ,మండల కమిటీ సభ్యులు నాగం మల్లయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు వెలుగు చేగువేరా, గ్రామ పేదలు కంకణాల మణెమ్మ, రావుల సావిత్రి ,వేముల నర్సమ్మ, పులిగుజ్జు ఉప్పమ్మ, లక్ష్మి, తురుక విజయ, చాపల మల్లిక ,ఏపూరు అనుష, కంకణాల లలిత ,కొండ రాధా, కంకణాల శీను ,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మైనంపాటి వీరారెడ్డి, ఉపాధ్యక్షులు సామి రెడ్డి నవీన్ రెడ్డి ,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పనస శ్రీనివాస్, ఉప్పుల ఉపేందర్ ,మండల కాంగ్రెస్ నాయకులు గుండ్ల లక్ష్మారెడ్డి ,ముక్క రామయ్య,  టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు బోర్రాజు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.